![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1122 లో.....అనుపమ మా అన్నయ్య ముందే వదినని అడిగింది. ఇంకోసారి తన జోలికి తన కొడుకు జోలికి రావద్దు అంది. అన్నయ్య కూడా వదినకి వార్నింగ్ ఇచ్చాడు. అంతే కాదు నీ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ కూడా చూడమన్నాడని మనుతో మహేంద్ర అంటాడు. బావ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ అవుతుంది అత్తయ్య.. నిజం చెప్తేనే కదా అని ఏంజిల్ అంటుంది. ఇక తన ఇష్టమని మహేంద్ర అంటాడు. అప్పుడే అనుపమకి ఫోన్ వస్తుంది. అవతల వ్యక్తి అనుపమతో.. నువు నీ కొడుకుని తీసుకొని సిటీ వదిలేసి వెళ్ళపో లేదంటే ఇన్నాళ్లుగా దాస్తున్న నీ కొడుకు ప్రశ్నకి నేను సమాధానం చెప్తానని అంటారు. దాంతో ఎవరు మీరని అనుపమ అడుగగా.. ఫోన్ కట్ చేస్తారు. దాంతో అనుపమ టెన్షన్ పడుతుంటుంది. ఏమైందని మహేంద్ర అడుగగా.. ఏం లేదని అనుపమ చెప్తుంది. ఏదైనా ప్రాబ్లెమ్ ఉంటే చెప్పమని మహేంద్ర అంటాడు.
మరొకవైపు పెద్దావిడకి సరోజ భోజనం వడ్డిస్తుంటే.. అప్పుడే రంగా వస్తాడు. మేడన్ రాలేదా అంటూ వసుధారని పిలుస్తాడు. వసుధార రాగానే భోజనం చెయ్యమని అంటాడు. నాకు ఆకలిగా లేదని వసుధార అనగానే.. కొంచెం తినండి అని రంగా రిక్వెస్ట్ చేస్తాడు. పదంతో వసుధార సరే అంటుంది. సరోజ కావాలనే ప్లేట్ లో వాటర్ పోసి చూసుకులేదని అంటుంది. మేడమ్ కి సారి చెప్పమని రంగా అనగానే.. నేను చెప్పనని సరోజ అంటుంది. నేను వడ్డించనని సరోజ అనగానే.. ఎన్నో సార్లు బాధపడ్డాను ఇలా భోజనం దగ్గర అవమానం జరిగితే ఎలా ఉంటుందంటూ వసుధార కోపంగా అక్కడ నుండి వెళ్తుంది. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదంటూ సరోజపై రంగా కోప్పడతాడు. ఆ తర్వాత రంగా భోజనం తీసుకొని.. వసుధార దగ్గరకి వెళ్తాడు. భోజనం చెయ్యమని అడుగుతాడు. నేను చెయ్యనని వసుధార అంటుంది. ఆ తర్వాత రేపు నాతో వస్తారా అని వసుధార అనగానే.. సరే వస్తాను. నిన్ను మీ ఇంటిదగ్గర దిగపెడతానని రంగా అంటాడు. మీ డాడ్ మిమ్మల్ని గుర్తుపడతారు.. అప్పుడు తెలుస్తుందని వసు అంటుంది. ఆ తర్వాత రంగా దగ్గరకి సరోజ వస్తుంది. రేపు మేడమ్ వెళ్లిపోతున్నారని అనగానే.. సరోజ హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేనే వెళ్లి దింపి వస్తానని రంగా చెప్తాడు.
మరొకవైపు అనుపమకి ఒకతను ఫోన్ చేసి.. నువ్వు వెళ్ళిపోకుంటే అందరికి మహేంద్రనే మను తండ్రి అని చెప్తాను అని బ్లాక్ మెయిల్ చేయగానే.. అనుపమ టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత సరోజ వసుధార దగ్గరకి వచ్చి.. వెళ్లిపోతున్నావంట కదా అంటుంది. రిషి సర్ ని అక్కడే ఉంచేసుకుంటా అని వసుధార అనగానే.. సరోజ టెన్షన్ పడుతుంది. నువ్వు వెళ్ళేటప్పుడు నా గుర్తుగా నేనొక గిఫ్ట్ ఇస్తానని సరోజ అంటుంది. ఆ తర్వాత వసుధార పెద్దావిడ దగ్గరికి వెళ్లి.. రంగా అసలు మీ మనవడేనా అని అడుగుతుంది. దాంతో ఆవిడ తడబడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |